ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల బైక్‌ ర్యాలీ

Jan 11,2024 00:05
సమగ్రశిక్ష ఉద్యోగుల

ప్రజాశక్తి – కాకినాడ

సమగ్రశిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జెఎసి పిలుపు మేరకు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహిం చారు. భానుగుడి సెంటర్‌ నుంచి మెయిన్‌ రోడ్డు, దేవాలయం వీధి, కలెక్టరేట్‌ మీదుగా ఈ ర్యాలీ సాగిం ది. ఈ సందర్భంగా కాకినాడ జెఎసి జిల్లా అధ్యక్షుడు ఎం.చంటిబాబు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్య నారాయణతో చర్చలు విఫలమైతే నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్రశిక్ష ఉద్యో గులకు మినిమం టైమ్‌ స్కెల్‌ అమలు చేయాలని, అన్ని కేంద్ర పథకాల్లో ఉద్యోగులకు అమలవుతున్న హెచ్‌ఆర్‌ పాలసీని సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేయడాన్ని మాను కోవాలని హితవు పలికారు. చట్టబద్ధంగా నెలరోజుల ముందు సమ్మె నోటీస్‌ ఇచ్చి సమ్మె చేస్తున్న ఉద్యోగులపై షోకాజ్‌ నోటీసులు, టర్మినేషన్‌ లెటర్లు ఇచ్చి మా ఉద్యమాన్ని ఆపలేరని, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తెలిపారు. అనకాపల్లిలో జగన్‌ ప్రభుత్వం బలి తీసుకున్న సమగ్రశిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగం ఇవ్వాలని, పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలా ఎంతమంది ప్రాణాలు బలితీసుకుంటారో జగన్‌ సమా ధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ శిబిరానికి తాళ్లరేవు మండలం జి.వేమవరం టీచర్లు ప్రసునా, పద్మావతి, కామేశ్వరి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, జెఎసి నాయకులు సత్యనాగమణి, ఎంవి.సాయికిరణ్‌, ఎ. లోవరాజు, పివి వి.మహాలక్ష్మి, ఎం.రాధా కృష్ణ, కె.చం ద్రశేఖర్‌, జి.నారాయణ, ఎంబి.సాల్మన్‌, పి. రాజు, కె.శ్రీనివాస్‌, ఎం.గంగాధర్‌ నాయకత్వం వహించారు.

➡️