ఎస్‌ఐగా కూలీ బిడ్డ

ప్రజాశక్తి- చక్రాయపేట తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తమ రెక్కలు ముక్కలు చేసి తమ కొడుకుని ఉన్నత చదువులు చదివించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎస్‌ఐగా ఎంపికయ్యారు. వివరాలు.. మండలంలోని చిలేకంపల్లె గ్రామానికి చెందిన వేంపల్లి నారాయణరెడ్డి ఎస్‌ఐగా 2023వ బ్యాచ్‌లో ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటూ ఎస్‌ఐ ఎంపిక కావడం పట్ల బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. అతని తల్లిదండ్రులు వేంపల్లి చెన్నారెడ్డి, వెంకటసుబ్బమ్మలు వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించడానికి ఎంతో తాపత్రయపడుతూ వచ్చారు. తండ్రి చెన్నారెడ్డి మరణ అనంతరం నారా యణరెడ్డికి ఉద్యోగం వచ్చింది. ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి వరకు చక్రాయపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యనభి ంచాడు. ఇంటర్‌ రాయచుట్టి విఆర్‌ కాలేజీ, బిటెక్‌ గుత్తి ఎస్‌కెడి ఇంజినీ రింగ్‌కళాశాలలో చదివారు. ఇంజనీరింగ్‌ కాలేజీ చదివి 2017 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 2023వ సంవత్సరంలో కర్నూల్‌లో టెస్ట్‌ రాసి 2023 బ్యాచ్‌లో ఎస్‌ ఐ ఉద్యోగానికి అర్హత సాధించారు. తమ గ్రామానికి నారాయణరెడ్డి ఎస్‌ఐ పోస్టుకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.

➡️