ఎస్మా ప్రయోగం దుర్మార్గం

Jan 7,2024 21:21

ప్రజాశక్తి – బలిజిపేట : అంగన్వాడీలు తమ హక్కుల పరిరక్షణకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే సమస్యలు పరిష్కరించడం మానేసి ఎస్మా ప్రయోగించడం దారుణమైన చర్యని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, అంగన్‌వాడీవర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు కె.దాలమ్మ విమర్శిం చారు. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చట్టబద్ధంగా 27రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యలను పరిష్కరించకుండా జిఒ 2 తీసుకొచ్చి, అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం, చట్ట వ్యతిరేకమని, అది అంగన్వాడీలకు వర్తించదని అన్నారు. ఆదివారం బలిజిపేటలో ప్రధాన కూడలిలో కొనసాగుతున్న అంగన్‌వాడీల నిరవధిక సమ్మెలో వారు మాట్లాడారు. అంగన్వాడీలు, ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారు గౌరవ వేతనంతో పని చేస్తున్నారని, ఇది ప్రభుత్వ ఉద్యోగులైన, అత్యవసర సర్వీసులైన, డాక్టర్లు హాస్పిటల్‌, విద్యుత్తు, పాలు ట్రాన్స్పోర్ట్‌, మంచినీరుకి మాత్రమే వర్తిస్తాయన్నారు. కనీస అవగాహన మంత్రులకు, అధికారులకు అవగాహన లేకపోవడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం, అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బెదిరింపుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా అంగన్‌వాడీ లపై దుర్మార్గంగా ఎస్మా ప్రకటించడం అన్యాయన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వం అణాలనుకుంటే అంతకు పదిరెట్లు ఉద్యమిస్తారని హెచ్చరించారు. అనంతరం 2 జీవో కాపీలని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆరు నెలలు, సమ్మె నిషేధమని, ప్రకటించారని, ఇదేమి న్యాయమని, ప్రశ్నిం చారు. మొండిగా వ్యవహరించకుండా రాష్ట్ర నాయకులను చర్చలకు ఆహ్వానించి, సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున అంగన్‌వాడీలు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన తలపెట్టిన సమ్మె ఆదివారం 27వ రోజు నిరాహార దీక్షలు కొనసాగాయి. సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి, నాయకులు బి.లక్ష్మి, రామలక్ష్మి, గెద్ద తులసి నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు ఇస్తూ ప్రభుత్వం ఎన్ని ఎస్మాలు ప్రయోగించినా అంగన్వాడీల జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఆదివారం జరిగిన దీక్షల్లో భద్రగిరి, బలిజిపేట మండలాల సెక్టార్ల అంగన్వాడీలు పాల్గొన్నారు. పాలకొండ : అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ కాపీలను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమాప్రభ, బి.అమరవేణి, ప్రాజెక్ట్‌ ప్రతినిధులు ఎస్‌.గంగమ్మ, జి.శారద, లలిత, దివ్య, ఆదిమ్మ, భవాని, శ్రీదేవి, నిర్మల, తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ నిర్బంధాన్ని మానుకొని వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కురుపాం : ఎస్మా పత్రాలను అంగన్‌వాడీలు దహనం చేశారు. స్థానిక పెట్రోల్‌ బంకు జంక్షన్‌ వద్ద అంగన్‌వాడీలు తలపెట్టిన సమ్మె శిబిరం వద్దకు సిఐటియు నాయకులు పువ్వల తిరుపతిరావు వెళ్లి వారికి దీక్ష మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమారి ప్రాజెక్ట్‌ కార్యదర్శి జె.సరోజ, కురుపాం, జియ్యమ్మవలస మండలాలకు చెందిన అధిక సంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. సాలూరు: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు చేపట్టిన సమ్మె 27రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఎస్మా జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు బి.రాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టంతో బెదిరింపులకు దిగుతోందన్నారు. తమ డిమాండ్లను ఆమోదించే వరకు సమ్మె విరమించేది లేదని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్యామల, వరలక్ష్మి, తిరుపతమ్మ, పార్వతి, శశికళ పాల్గొన్నారు. మక్కువ: స్థానిక బజార్‌ సెంటర్లోలో ఎస్మా జీవో కాపీలను దగ్ధం చేస్తూ అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శ గంట జ్యోతిలక్ష్మి, ప్రాజెక్ట్‌ నాయకులు దాలమ్మ మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 27 రోజులుగా సమ్మె చేస్తుంటే, సమస్యల పరిష్కారం చేయకుండా, 2 జీవో తీసుకొచ్చి అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం చట్ట వ్యతిరేకమని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, నాయకులు వి.ఇందిర మాట్లాడుతూ ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా, రాష్ట్ర నాయకులను, చర్చలకు ఆహ్వానించి, సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు సావిత్రి, గౌరమ్మ, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు. సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట అంగన్‌వాడీల తలపెట్టిన నిరవధిక సమ్మె శిబిరం వద్ద ఎస్మా చట్టం జీవో 2 కాపీని దగ్ధం చేశారు. అనంతరం, సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 27రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె తీవ్రతను ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రయో గించి ఎస్మా చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకుంటే ప్రజా మద్దతు కూడగట్టి పోరాటన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, కార్యకర్తలు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఎస్మా ప్రయోగించడం పట్ల అంగన్వాడీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆదివారం ఎల్విన్‌ పేట కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షులు సత్యవతి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జగనన్న మాట తప్పారంటూ పేర్కొన్నారు. అనంతరం ఎస్మా జిఒ కాపీను దగ్ధం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ మండల కార్యదర్శి వై.కస్తూరి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కోలక అవినాష్‌, చెముడు గూడ ఎంపిటిసి మండంగి రమణ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.గరుగుబిల్లి: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడి వర్కరు,్ల హెల్పర్లు ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవో నెంబర్‌ 2 కాపీలను రహదారిపై దగ్ధం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ కాత్యాయిని, లక్ష్మి, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు. సీతానగరం : అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టం జీవో కాపీలను అంగన్వాడీ కార్యకర్తలు దగ్ధం చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన అంగన్వాడీల సమ్మె ఆదివారానికి 27రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర మాట్లాడుతూ అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేసి, అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతి, మండల నాయకులు మడక సత్యవతి, సునీత, సిఐటియు మండల కార్యదర్శి జి వెంకటరమణ, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగులపై నిర్బంధాలను వీడాలి : సిఐటియుజిఒ ప్రతులు దగ్ధంప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వీడాలని, ప్రజాస్వామ్య దేశంలో నిర్బంధానికి తావులేదని సిఐటియు నాయకులు జివి రమణ, బివి రమణ అన్నారు. స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఆదివారం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జీవో నెంబర్‌ 2 కాపీలను దగ్ధం చేస్తూ ప్రభుత్వ తీరు పట్ల నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్‌ 2ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రం ప్రసాదించిన గాంధీ మహాత్ముని ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ, మున్సిపల్‌, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, తమ సమస్యలపై శాంతియుతంగా పోరాడుతున్న కార్మికులు, ఉద్యోగుల పట్ల నిర్బంధాన్ని ప్రయోగించే ధోరణి విడనాడాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఈ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు తాతబాబు, క్రాంతి, శంకర్రావు, లక్ష్మణ, మౌళి, పట్టణపౌర సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.సాలూరురూరల్‌ : అంగన్వాడీలపై ప్రభుత్వ దుర్మార్గం ఆపాలని, జీవో 2ను రద్దు చేయాలని, అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పట్టివలసలో జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్మవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వ ఇచ్చిన జీవో ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వంతల చిన్న, శివ, రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.పాచిపెంట : రాష్ట్ర ప్రభుత్వం జీవో 2ను తక్షణమే రద్దుచేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని మెట్టవలస వద్ద జీవో ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు సుకూరు అప్పలస్వామి, పలువురు గిరిజనులు పాల్గొన్నారు.

➡️