ఐఎఫ్‌ పి ప్యానల్స్‌ ఉపయోగిస్తూ బోధన చేయాలి

Mar 2,2024 21:39
ఫొటో : విద్యార్థినులతో మాట్లాడుతున్న ఎంఇఒ షేక్‌ మస్తాన్‌వలీ

ఫొటో : విద్యార్థినులతో మాట్లాడుతున్న ఎంఇఒ షేక్‌ మస్తాన్‌వలీ
ఐఎఫ్‌ పి ప్యానల్స్‌ ఉపయోగిస్తూ బోధన చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ఐఎఫ్‌పి ప్యానల్స్‌ ఉపయోగిస్తూ బోధనతోపాటు టోఫెల్‌ పరీక్షల నిర్వహణ చేయాలని ఎంఇఒ-1 షేక్‌ మస్తాన్‌ వలీ శనివారం పేర్కొన్నారు. మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల బిసి ఉర్థూ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి 7, 8 తరగతుల విద్యార్థుల అభ్యసన, పఠన సామర్థ్య నైపుణ్యాలను పరిశీలిస్తూ ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ఉపయోగిస్తూ విద్యార్థులకు బోధన చేయాలని, టోఫెల్‌ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ జవాబు పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. 8వ తరగతి వారికి ప్రభుత్వ వారు సరఫరా చేసిన ట్యాబ్స్‌ ప్రతిఒక్క విద్యార్థి ఉపయోగించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వాలని, లెర్న్‌ ఎ వడ్‌ ఎ డే క్రమం తప్పకుండా విద్యార్థులకు నేర్పించాలని ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించి, విద్యార్థుల సామర్థ్యాలు బాగున్నవని ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠశాలకు సంబంధించి ఏమైనా అవసరాలు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని తెలిపి విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మధ్యాహ్న భోజనం పరిశీలించి అన్ని రికార్డులను తనిఖీలు చేశారు.

➡️