ఐటి రంగంపై విద్యార్థులకు శిక్షణ

ప్రజాశక్తి-టంగుటూరు : ప్రస్తుతం ఐటి రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, ఈ నేపథ్యంలో ఉద్యోగం సాధించాలంటే విద్యార్థులలో మరింత నైపుణ్యత, సామర్ధ్యాలు అవసరమని పేస్‌ కళాశాల పూర్వ విద్యార్థి షేక్‌ సాజిద్‌ బాషా తెలిపారు. స్థానిక పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ తతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఐటి రంగం.. ఒడిదుడుకులు.. ఉద్యోగ అవకాశాలపై శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కళాశాలలో 2016-20 సంవత్సరాలలో బిటెక్‌ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ కార్లాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ -3గా ఉద్యోగం చేస్తున్నట్లు సాజిద్‌ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఉద్యోగం కోసం తను పడిన కష్ట నష్టాలను విద్యార్థులకు వివరించారు. కళాశాలల ద్వారా ఇస్తున్న శిక్షణ, అవగాహన సమావేశాలను విద్యార్థినీ విద్యార్థులు అధ్యయనం చేసి సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ మద్దిశెట్టి శ్రీధర్‌, ప్రిన్సిపల్‌ జివికె.మూర్తి, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి గిరిబాబు, అధ్యాపకులు పఠాన్‌ హుస్సేన్‌ బాషా, డి.జనార్దన్‌ రెడ్డి, కో ఆర్డినేటర్‌ ఎ.మౌనిక తదితరులు పాల్గొన్నారు.

➡️