ఒకటి నుంచి రూ.3 వేలు పింఛను

Dec 28,2023 21:22

ప్రజాశక్తి-పార్వతీపురం : జనవరి ఒకటో తేది నుంచి మూడు వేల రూపాయలు వైఎస్‌ఆర్‌ పింఛను కానుకగా అందించనున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వైఎస్‌ఆర్‌ పింఛను కానుక, చేయూత, ఆసరా, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, తదితర పథకాల అమలపై సిఎం సమీక్ష నిర్వహించారు.లా కార్యక్రమాల కోసం ముందుగానే షెడ్యూల్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని షెడ్యూల్‌ని రూపొందించాలని ఆదేశించారు. జనవరి ఒకటి నుంచి 8వ తేదీ వరకు వైఎస్‌ఆర్‌ పింఛను కానుక కింద కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు వైఎస్‌ఆర్‌ ఆసరా, ఫిబ్రవరి 5న వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ప్రారంభిస్తామని, చేయూత కింద 5 నుంచి 14వ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️