ఒటిఎస్‌ పథకం అమలు చేయండి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఆంధ్రపదేశ్‌ రాష్ట్రంలో వ్యా పారుల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఒటిఎస్‌ పథకం అమలు చేయాలని ఎపి ట్యాక్స్‌ ప్రాక్టిషనర్స్‌ అండ్‌ కన్సల్టెన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ ఆడిటర్‌ పఠాన్‌ ఫరీష్‌ఖాన్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. సోమవారం జిల్లా పర్యటనలో ఉన్న సిఎంకు ఫరీఫ్‌ఖాన్‌ వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌ మరికొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు వ్యాపా రస్తుల స్థితిగతులను పరిశీలించిన తరువాత ఒటిఎస్‌ (వన్‌ టైం సెటిల్‌మెంట్‌) పథకం తీసుకువచ్చారని సిఎంకు వివరించారు. ఎపింలో ఈ పథకం అమలు చేసినట్లయితే రాష్ట్ర చరిత్రలో వ్యాపార వర్గాలకు గొప్ప సహాయం చేసిన సిఎంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వ్యాపారుల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఒటిఎస్‌ పథకం అమలు చేయాలని కోరారు. ఈపథం అమలుగురించి వాణిజ్యపన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌కు నవంబర్‌ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్యవర్గాలు, ఆడిటర్స్‌ల ద్వారా నివేదికలు తెప్పించుకుని తమకు పంపించారని గుర్తు చేశారు. సహృదయంలో ఒటిఎస్‌ అమలు చేయాలని కోరారు.

➡️