ఒపిఎస్‌ అమలు చేసే వారికే ఓటు

Feb 7,2024 22:03
ఫొటో : పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు
ఒపిఎస్‌ అమలు చేసే వారికే ఓటు
ప్రజాశక్తి-మర్రిపాడు : ఒపిఎస్‌ను అమలు చేసే వారికే తమ ఓటు అని యుటిఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. పాత పెన్షన్‌ పునరుద్ధరణ రాజకీయ అజెండా కావాలని ఆకాంక్షిస్తూ ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ అనే నినాదంతో యుటిఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు బుధవారం స్థానిక ఉన్నత పాఠశాలలో ఓట్‌ ఫర్‌ ఒ.పి.ఎస్‌. పోస్టర్లను యుటిఎఫ్‌ మండలా ధ్యక్షులు విజయభాస్కర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికల ముందు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ప్రస్తుతం సిపిఎస్‌ బదులుగా తీసుకువచ్చిన జిపిఎస్‌ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓపిఎస్‌ సాధనే అజెండా చేయాలని అన్ని రాజకీయ పక్షాల నాయకులను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కలుస్తామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కలుపుకొని ఒపిఎస్‌ సాధనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో మర్రిపాడు మండల యుటిఎఫ్‌ సహాధ్యక్షులు ఒ.వి.సుబ్బారెడ్డి, కిరణ్‌, జి.శ్రీనివాసులు, హరికృష్ణ, రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️