ఒపిఎస్‌ అమలు చేసే వారికే ఓటు

Feb 29,2024 21:43

ప్రజాశక్తి-బొబ్బిలి : జిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేసిన వారికే ఓటు వేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి పిలుపునిచ్చారు. ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ ప్రచార పత్రాలను గురువారం ఆమె విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఒపిఎస్‌ అమలు చేస్తామని ఎన్నికల్లో వైసిపి హామీ ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ఒపిఎస్‌ అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలకు ఓటు వేస్తామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ప్రసన్నకుమార్‌, సత్యనారాయణ, కె.కృష్ణదాసు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

➡️