ఒపిఎస్‌ కోసం మరో పోరుబాట : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-కడప అర్బన్‌ పాత పింఛన్‌ సాధన కోసం మరో పోరుబాటకు యుటిఎఫ్‌ సమాయత్తమైందని రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహేష్‌ బాబు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒపిఎస్‌ కోసం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయక పోను నాలుగేళ్ల తర్వాత జిపిఎస్‌ అనే మరో దుర్మార్గపూరితమైన పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసగించడమేనని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు రవికుమార్‌, సుజాత, రాణి, ట్రెజరర్‌ నరసింహారావు, రాష్ట్ర కౌన్సిలర్లు ఓబుల్‌రెడ్డి, రూతు ఆరోగ్య మేరీ, జిల్లా కార్యదర్శులు చెరుకూరి శ్రీనివాసులు, ఏజాస్‌ అహమ్మద్‌, శ్రీనివాసులు, చంద్ర ఓబుల్‌ రెడ్డి, సి.వి.రమణ, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, నాయకులు బత్తుల చంద్రశేఖర్‌, మస్తాన్‌ వల్లి, పెంచలయ్య, సుధాకర్‌, చెన్నయ్య,సుబ్బారావు, పార్థసారథి, వెంకటసుబ్బయ్య, శివ శంకర్‌ రెడ్డి, రాజా, గురు మోహన్‌, నాగన్న పాల్గొన్నారు.

➡️