ఓటరు జాబితా తనిఖీ

Dec 15,2023 21:54

  ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌  :  స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న నియోజకవర్గ ఓటర్ల జాబితాను జిల్లా పౌరసరఫరాల అధికారి కె.మధుసూదనరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్పులు నాలుగు శాతం కంటే ఎక్కువ, తొలగింపులు రెండు శాతం కంటే ఎక్కువగా ఉంటే ప్రత్యేక పరిశీలన చేయాలన్నారు. ఆయనతోపాటు ఎన్నికల డిటి బి.గౌరీశంకరరావు పాల్గొన్నారుఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె.మధుసూదనరావు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 14 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో135 మిల్లులు ఉన్నాయని తెలిపారు. మిల్లు యజమానులు రూ.54 కోట్లు బ్యాంకు గ్యారంటీ ఇచ్చారని తెలిపారు. 3.20 లక్షల గోనెసంచులు రైతులకు అందివ్వాలని నిర్దేశించామన్నారు. రోజువారీ కొనుగోళ్లపై సమీక్ష ఉంటుందన్నారు.

➡️