ఓటరు జాబితా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

ప్రజాశక్తి-పంగులూరు: రాష్ట్రంలో వైసిపి పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మంగళవారం మండ లంలోని కోటపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తో, జొన్నతాలిలోని పార్టీ కార్యా లయంలో జరిగిన సమావేశం లో రవికుమార్‌ ప్రసంగించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జగన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రని, నలిగి పోతున్న ప్రజలకు న్యాయం జరిగేలా, మద్దతు ఇచ్చేలా, గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కార్యకర్తలను కోరారు. జగన్‌ రెడ్డి తన అసమర్ధ, స్వార్థపూరిత విధానా లతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దెబ్బతీశారని, ఇందుకు ప్రతిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా ఐకమత్యంతో పనిచేసి సైకో ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ఓటర్లు జాబితాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అధికార పార్టీ ఎన్నికల్లో చేసే అక్రమాలను ఎదుర్కోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోటపాడు మాజీ సర్పంచ్‌ తాటి చిన సుబ్బారావు, మాజీ ఎంపీటీసీ గడ్డం నాగేశ్వరరావు, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి, పేర్ని వీరనారాయణ, మాజీ సొసైటీ అధ్యక్షులు పేర్ని లక్ష్మీనారాయణ, గ్రామ మాజీ సర్పంచ్‌ గోరంట్ల నాగేశ్వరరావు, రావులసింగరకొండ, గుంటుపల్లి పెద్ద ఆంజనేయులు, వీరగంధం రంగారావు, వీరంగం చంద్రమౌళి, గుంటుపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️