ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు

డిఆర్‌ఒకు ఫిర్యాదు చేస్తున్న సిపిఎం, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు

 పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల అవక తవకలకు పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి కె. వినా యకంకు సిపిఎం,టిడిపి, బిజెపి, జనసేన నాయకులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి విజయకుమార్‌ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్న వైసిపి రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో అక్రమ ఓట్లతో గెలుపొందాలని చూస్తుందని మండిపడ్డారు. ఓటర్ల మార్పులు చేర్పులు తొలగింపులు, పార దర్శకంగా జరగాలని డిమాండ్‌ చేశారు. టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు మాట్లాడుతూ టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు ఆదేశాల మేరకు ఓట్ల అవకతవకలపై ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశామన్నారు. బిజెప,ి జనసేన నాయకులు పాల్గొన్నారు.

➡️