ఓపీఎస్‌ పునరుద్ధరణపై వైఖరి చెప్పాలి

Feb 4,2024 00:22

ప్రజాశక్తి – తుళ్లూరు, చేబ్రోలు : సిపిఎస్‌ రద్దు, ఒపిఎస్‌ పునరుద్ధ రణపై రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలని, ఒపిఎస్‌ అమలు చేసేవా రికే తమ ఓటు అని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి, ఒపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ సిహెచ్‌ ఆదినారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం మండల విద్యా వనరుల కేంద్రం వద్ద క్యాంపెయిన్‌ పోస్టర్‌ను ఆవిష్కరి ంచారు. ఎన్నికల సందర్భంగా సిపిఎస్‌ రద్దు – ఒపిఎస్‌ అమలు హామీని జగన్‌ అధికారంలోకి వచ్చాక విస్మరించారని అన్నారు. కొత్తగా తెచ్చిన జిపిఎస్‌ విధానం ఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనకరం కాదని, పాత ఫెన్షన్‌ విధానం మాత్రమే మేలని చెప్పారు. కార్యక్రమంలో ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎ.శ్రీనివాసరావు, పి.వెంకటేశ్వర్లు, టి.పూర్ణచంద్రరావు, టి.ఉమామహేశ్వరరావు, సుజాత కుమారి, జ్యోతి పాల్గొన్నారు. మండలం కేంద్రంమైన చేబ్రోలులోని నడింపేట ఉర్దూ ప్రాథమిక పాఠశాల వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. యుటిఎఫ్‌ మండల అధ్యక్షు, ప్రధాన కార్యదర్శులు రమేష్‌బాబు, డి.నాగేశ్వర రావు, కోశాధికారి కె.శ్రీనివాసరావు కార్యదర్శులు అర్సతున, శ్రీనివాసరావు, విజయరాజు ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ శ్రీరామమూర్తి, జిల్లా కౌన్సిలర్లు రమణ రావు, రత్నశేఖర్‌బాబు, చాయనా థవర్మ పాఠశాల కమిటీ సభ్యులు సిరాజ్‌, జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️