కదం తొక్కిన అంగన్వాడీలు

కడప అర్బన్‌ : సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 19వ రోజు చేరుకుంది. నగరంలో పోస్టాఫీసు వద్ద వైఎస్సార్‌ విగ్రహం ఎదుట అంగన్వాడీల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం కళ్ళుతెరవాలని నినాదాలు చేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. నిర్బంధాలతో అంగన్వాడీల ఉద్యమాన్ని ఆపలేరని సిఐటియు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కామనురు శ్రీనివాసులురెడ్డి, బి మనోహర్‌, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి, బాదుల్లా, మదిలేటి, ఆర్‌. లక్ష్మీ దేవి, బి లక్ష్మీదేవి. గంగావతి మాట్లాడారు. ఇప్పటికే రెండుసార్లు మంత్రులు అంగన్వాడీల సమస్యలపై చర్చించి కూడా ముఖ్యమంత్రితో చర్చించకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీ ల సమస్యల పట్ల సర్వత్రా సానుకూలత ఉన్నా ముఖ్య మంత్రికి సమస్యను పరిష్కరించడం చేతకావడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకురాలు భాగ్యలక్ష్మి, సిఐటియు నాయకులు అంజనా దేవి, పెద్ద ఎత్తున అంగన్వాడి వర్కర్లు, మినీ అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు. బద్వేలు : ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట ు్టకోవాలని సమ్మెలో భాగంగా శనిఆవరం బద్వేల్‌ 12వ సచివాలయ వద్ద అంగన్వాడీలు భారీ ధర్నా నిర్వహి ంచారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు మాట్లాడుతూ 19 రోజులుగా అంగ న్వాడీలు అనేక ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వాపో యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె.నాగేంద్రబాబు, సిఐటియు పట్టణ కో- కన్వీనర్ప్‌ పి.సి.కొండయ్య ,సిఐటియు నాయకులు రాజగోపాల్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కదిరయ్య, డివైఎఫ్‌ఐ నాయకులు అదిల్‌, ఐద్వా సంఘం నాయకులు బాలమ్మ నాగమ్మ అంగన్వాడీ ప్రాజెక్ట్‌ నాయకురాలు సుభాషిని, ఉసేనమ్మ, విజయమ్మ, శోభా దేవి, సుభద్ర, జయప్రదమ్మ, రాధమ్మ, రత్నమ్మ, తులసమ్మ, కళావతి, కె.వి సుభాషిని, వాణి, వసంత, సరోజనమ్మ, వందలాదిమంది అంగన్వాడీలు పాల్గొన్నారు. చాపాడు : వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు శనివారం సచివాలయాన్ని ముట్టడించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రారంభించి అనంతరం ర్యాలీగా చాపాడు సచివాలయం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల మండల నాయకులుసుజాత మాట్లాడుతూ అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేంపల్లె : అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులకు జీతాలు పెంచడంతో పాటు గ్రాట్యుటీ ఇవ్వాలని అంగన్వాడీలందరూ వేంపల్లెలోని ప్రజాప్రతినిధుల ఇళ్లును ముట్టడి చేశారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ చేస్తున్న సమ్మె శనివారం నాటికి 19వ రోజుకు చేరుకొంది. దీంతో అంగన్వాడీలు జడ్‌పిటిసి రవికుమార్‌రెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌రెడ్డి ఇళ్లను ముట్టడించి వినతి పత్రాలు అందజేశారు. అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దష్టికి తీసుకెళ్లాలని అంగన్వాడీ సంఘాల నాయకులు సరస్వతి, లలితా, సావిత్రి, శైలజా, శాంత కుమారి, శ్యామలాలు కోరారు. అంగ న్వాడీల సమస్యలను సిఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి దష్టికి తప్పక తీసుకెళ్తామని ప్రజాప్రతినిధులు హమీ ఇచ్చారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీలు మోకాళ్లపై కూర్చుని సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సత్య నారాయణ, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు మంజుల మాట్లాడుతూ అంగన్వాడీలు 19 రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవ హరించడం సరైందని కాదన్నారు. టిడిపి నాయకులు సి.ఎం సురేష్‌ నాయుడు టెంట్‌ వద్దకు వచ్చి అంగన్వాడీలకు ఉద్యమ అవసరాల రూ. లక్ష రూపాjలు అందించారు. రోజూ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని, సమ్మె ముగిసే వరకు మీకు అండగా ఉంటామని తెలిపారు. బిజెపి నాయకులు న్యాయవాది గొర్రె శ్రీనివాసులు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఆందోళనలో కార్యదర్శి విజరు కుమార్‌ డివైఎఫ్‌ఐ నాయకులు డేవిడ్‌ అంగన్వాడీ యూనియన్‌ కార్యదర్శి సుబ్బలక్ష్మి, రాజి, గీత, నిర్మల, కష్ణవేణి, లక్ష్మీదేవి, విజయ,నాగలక్ష్మి అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభించి 19 రోజులు అయిన సందర్భంగా శనివారం పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో నల్ల దుస్తులను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు గడ్డితింటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షుడు బొజ్జ చిన్నయ్య మాట్లాడుతూ 19 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సెక్టారు లీడర్‌ విజయమ్మ సుధా, స్వాతి, నారాయణమ్మ జోస్పీన్‌,పోరుమామిళ్ల అంగన్వాడి సెక్టార్‌ లీడర్లు, కార్యకర్తలు ,అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముద్దనూరు : జగనన్న అంగన్వాడీలను అలుసుగా చూస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని డివైఎఫ్‌ నగర కార్యదర్శి వీరనాల శివకుమార్‌ అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. జగన్‌ అంగన్వాడీలను అలుసుగా చూస్తున్నారన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేక పోతే రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు కళావతి, ప్రమీల పాల్గొన్నారు. మైదుకూరు : తమ పొట్ట కొట్టొద్దు అంటూ అంగన్వాడీలు కార్యకర్తలు, హెల్పర్లు ప్రొద్దుటూరు రోడ్డులోని 9వ వార్డు సచివాలయాన్ని ముట్టడించారు. శనివారం మైదు కూరులో అంగన్వాడీల 19వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు సచివాలయం సిబ్బందితో తమ సమస్యను విన్నవించారు. తాము విధుల్లో ఉంటే మీరు చొరబడే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జి శివకుమార్‌, ఎఐటియుసి నాయకులు శివరాం, సిపిఎం మండల కార్యదర్శి షరీఫ్‌, సిఐటియు నాయకులు జహంగీర్‌బాషా, అంగన్వాడీ నాయకులు అనుషా, రిజ్వాన, రమాదేవి, లతా పాల్గొన్నారు. జమ్మలమడుగు : పట్టణంలోని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 19వ ఆకారంతో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. శనివారం జమ్మలమడుగు పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో 1.2 వార్డు సచివాలయ సిబ్బందికి అంగన్వాడీ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు భాగ్యమ్మ, సిఐటియు నాయకులు దాసరి విజరు లక్ష్మీదేవి, జ్యోతి,ఏఐటీయూసీ నాయకులు ప్రసాదు, నరసమ్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు.

➡️