కనీస వేతనాలు ఇవ్వాలి

ప్రజాశక్తి-కడప అర్బన్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌కి 1974 సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగుల చట్టాన్ని అమలు పరచాలని, కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు రామాంజులరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కడపలో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ 2 లక్షల మంది కార్మికులు ఒక్క రోజు సమ్మెలో భాగస్వాములైనట్లు తెలిపారు. కడప శాఖలో సభ్యులుగా ఉన్న 200 మంది సభ్యులు సమ్మెలోకి వెళ్లారని చెప్పారు. జిల్లా అధ్యక్షులు రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ అత్యవసర, నిత్యావసర మందుల ధరలు తగ్గించాలని, వైద్య పరికరాలపై జీఎస్టీ తీసివేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి శంకర నారాయణ మాట్లాడుతూ సేల్స్‌ అధారిత వేధింపులను ఆపివేసే విధంగా యాజమాన్యాల పై ప్రభుత్వాలు చట్టాలను తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో ఉపాధ్యక్షులు నరసింహులు, సభ్యులు పాల్గొన్నారు.

➡️