కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం

Feb 21,2024 23:40

తలపడుతున్న గుంటూరు-అనంతపురం బాలికలు జట్లు
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : 33వ అంతర్‌ జిల్లాల బాలబాలికల కబడ్డీ పోటీలు స్థానిక వృందా మహిళా జూనియర్‌ కాలేజీ మైదానంలో బుధవారం ప్రారంభమ య్యాయి. పోటీలు శుక్రవారం వరకూ కొనసాగ నున్నాయి. ప్రారంభం సభకు కాలేజీ డైరెక్టర్‌ అనూష అధ్యక్షత వహించారు. ముఖ్యఅతి థులుగా హాజరైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైసిపి నరసరా వుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ఆడటమే నిజమైన విజయమని అన్నారు. గెలుపోటములను సహజమనే విషయాన్ని గుర్తించాలని, ఓటమిని విజయానికి పునాది చేసుకోవాలని చెప్పారు. పోటీల్లో స్నేహ భావంతో ఉత్సాహంగా పాల్గొనాలని సూచిం చారు. పాఠశాలల్లో తగినంతగా క్రీడా ప్రాంగ ణాలు లేని కారణంగా క్రీడలు నానాటికీ కనుమరు గవుతున్నాయని సవాళ్లను అధిగమించి రాణించిన వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. తొలుత పట్టణంలో క్రీడాకారులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్రీడాకారుల నుండి వందనం స్వీకరించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. మొదటి మ్యాచ్‌గా బాలికల విభాగంలో గుంటూరు-అనంతపురం జట్లు, బాలుర విభాగంలో కృష్ణా-గుంటూరు జట్లు తలపడగా అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఏసురత్నం, కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీకాంత్‌, గుంటూరు యార్డు చైర్మన్‌ ఎన్‌.రాజానారాయణ, నాగుల్‌మీరాన్‌, శివప్రాసాద్‌, సహారా మౌలాలి, కట్టా సాంబయ్య పాల్గొన్నారు.

➡️