కమిషనర్‌ విజయసారథి బదిలీ

ప్రజాశక్తి-చీరాల: చీరాల మున్సిపల్‌ కార్యాలయంలో ప్రస్తుత గ్రేడ్‌-1 కమిషనరుగా పనిచేస్తున్న బి విజయ సారథి మంగళవారం బదీలి అయ్యారు. ఆయన స్థానం లో పార్వతీపురంలో మునిసిపల్‌ కమిషనరుగా విధులు నిర్వహి స్తున్న పి సింహా చలం చీరాలకు మునిసిపల్‌ కమిషనరుగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బి విజయ సారథికి మునిసిపల్‌ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వార్డు సభ్యులు, ఛైర్‌ పర్సన్‌, మునిసిపల్‌ కౌన్సిలర్ల అధ్వర్యంలో కౌన్సిల్‌ హాల్‌లో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా ఛైర్‌ పర్సన్‌ జంజనం శ్రీనివాసరావు, డిఈ ఐసయ్య, పలువురు మాట్లాడుతూ కమిషనరు బి విజయ సారథి సేవలను కొనియాడారు. ఎలక్షన్‌ అనంతరం తిరిగి చీరాల మునిసిపల్‌ కమిషనరుగా రావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా అటెండరు స్ధాయి నుంచి బిల్లు కలెక్టరు వరకు దాదాపు 40 సంవత్సరాలు మునిసిపాలిటీకి ఎన్నో సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్న వార్డు అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీ టి చెన్నయ్య రిటైర్డ్‌ అయిన సందర్భంగా ఆయనను కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌డోర్‌, అవుట్‌ డోర్‌ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️