కలప స్మగ్లర్లకు అడ్డుగా ఏజెన్సీ

Jan 13,2024 20:14

ప్రజాశక్తి – సీతంపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, సంరక్షించాలని, దీనివల్ల సకాలంలో వర్షాలతో పాటు వాతావరణం స్థితిగతులు సమానంగా ఉంటాయని చెప్తున్నారు. ఏజెన్సీలో ఇందుకు భిన్నంగా మారింది. సీతంపేట ఏజెన్సీలో కలప స్మగ్లరుకు అడ్డగా మారింది. యథేచ్ఛగా ట్రాక్టర్లతోనూ, పికప్‌ వాహనా లతో అక్రమ కలప రవాణా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు చూసీచూ డనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఏజెన్సీలో అధికంగా టేకు, పనస, ఏగిసి, గుగ్గిలం, మామిడి తదితర కలప పూతికవలస, మర్రి పాడు, చిన్నబగ్గ, దోనుబాయి, కడగండి, శంభాం తదితర ప్రాంతాల నుంచి కలప అక్రమంగా తరలిపో తుంది. ఇక వర్షాకాలంలో కలప స్మగ్లర్లకు అనువుగా మారుతుంది. ఎందుకంటే ఆ సమయంలో అటవీ శాఖాధికారులెవరూ తిరగకపోవడంతో వాహనాల ద్వారా కలప మిల్లులకు తరలిపోతుంది. ఇక సంక్రా ంతి సమయంలో అందరూ పండగ సీజన్లో తల మొన కలై ఉంటే అక్రమార్కులు ఇదే అదునుగా కలప రవాణా చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై ఫారెస్ట్‌ బీట్‌ అధికారి దాలినాయుడు వద్ద ప్రస్తావి ంచగా, బేస్‌ క్యాంపులో పగడ్బందీగా నిర్వహిస్తున్నా మని, ప్రస్తుతం బత్తిలిలో ఏనుగులు సంచరిస్తున్నా యని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సమాధానం ఇచ్చారు.

➡️