కష్టజీవుల కోసం పోరాడిన మహోన్నతవ్యక్తి లెనిన్‌

ప్రజాశక్తి -నాగులుప్పలపాడు : ప్రపంచంలో కమ్యూనిస్టు నాయకత్వాన కష్టజీవుల రాజ్యం కోసం (సోషలిస్ట్‌ రాజ్యం) పోరాడి సాదించిన మొట్టమొదటి మహోన్నత వ్యక్తి లెనిన్‌ అని సిపిఎం రాష్ట్రకమిటీ సభ్యులు వై.సిద్ధయ్య పేర్కొన్నారు. నాగులుప్పలపాడు ప్రజాసంఘాల కార్యాలయంలో మార్కిస్ట్‌ మహోపాధ్యాయుడు లెనిన్‌ శతవర్ధంతి సభ ఆదివారం నిర్వహించారు ఈసభకు సిపిఎం జిల్లా నాయకులు జె.జయంతిబాబు అధ్యక్షత వహించారు ఈసందర్భంగా సిద్ధయ్య మాట్లాడుతూ లెనిన్‌ రష్యాలో పెట్టుబడి, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా శ్రామికులు, రైతులు, కార్మికులను ఏకం చేసి జార్‌ చక్రవర్తి ప్రభుత్వాన్ని కూల్చి ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపిం చారన్నారు 30 సంవత్సరాల పాటు కమ్యూ నిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. రైతులు, కార్మికులు జీవన ప్రమాణాలపై అధ్యయనం చేశా రన్నారు. ప్రస్తుత సమాజం కష్టజీవుల కోసం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిశగా మార్చాడం కమ్యూనిస్టులకే సాధమన్నారు. నేడు భారతదేశంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రభుత్వాలు కాల రాస్తున్నాయన్నారు. అప్పట్లో పనిగంటలు భారం తగ్గించి 8గంటల పని విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. నేటి పాలకులు 12 గంటల పని భారాన్ని పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. సమ్మె భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అని తెలిపారు. ఆ హక్కును కాలరాస్తూ అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మా చట్ట ప్రయోగించడం దుర్మార్గమని తెలిపారు. రానున్నకాలంలో యువత లెనిన్‌ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. కార్మికులు రైతులు ,ఉద్యోగుల పక్షాన నిలబడే వామపక్షాలను బలపర్చాల్సిన అవసర ముందన్నారు. ఈకార్యక్రంలో సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీకాంత్‌ ,జి. బసవపున్నయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️