కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

కాంగ్రెస్‌ శ్రేణుల

ప్రజాశక్తి – అంబాజీపేట, ముమ్మిడివరంతెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అంబాజీపేట సెంటర్లో పార్టీ శ్రేణులు స్వీట్లు పంచి కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నెల్లి వెంకటరమణ మహమ్మద్‌ ఆరిఫ్‌, ఆదుర్తి నారాయణమూర్తి, మండల కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ప్రజాస్వామిక వాదుల విజయం అని ముమ్మిడివరం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకుడు పి.ఉదయ భాస్కర వర్మ అద్వర్యంలో స్థానిక బుద్ధ పార్కు అవరణలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ విజయం ప్రజాస్వామిక వాదుల విజయంగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలించి ప్రజల విశ్వాసం పొందాలని సూచించారు. అనంతరం బాణసంచా కాల్చి, స్వీట్లు పంచారు. పి.జగ్గరాజు, వి.నాగేశ్వర రావు, గోడి భాస్కరరావు, ముషిణి శివ ప్రసాద రావు, దోనిపాటి ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️