కాంట్రాక్ట్‌,ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ను పట్టించుకోని ప్రభుత్వం

 చిలకలూరిపేట: ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ను ప్రభుత్వం, యాజమాన్యం గాలికి వదిలేసిందని ఎపిఎస్‌ఆర్‌టిసి కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) కమిటి రాష్ట్ర కన్వీనర్‌ వి.తులసిరాం అన్నారు. గురువారం స్థానిక ఆర్‌టిసి డిపోలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ ను కలిసి వారితో అనేక సమస్యలపై మాట్లాడారు. తులసిరాం మాట్లాడుతూ కార్మికులతో పనిచేయించుకునే విష యంలో పెడుతున్న శ్రద్ధ వారి హక్కులు, చట్టాల అమలులో ఆర్టీసీ యాజమాన్యం గాని, కాంట్రాక్టర్లు గాని చూపడం లేదని, సవరించిన వేతనాలు డిపో యూనిట్ల కాం ట్రాక్టర్లు ఎక్కడ అమలు చేయడం లేదని అన్నారు. అన్‌స్కిల్డ్‌ వర్కర్లకు రూ.11, 356, ఈ సెమీ స్కి ల్‌ వర్కర్లకు రూ.13,415, స్కిల్‌ వర్కర్లకు రూ.16,450, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.12,385 ఇవ్వాలని నోటిఫికేషన్‌ ఉన్నా అవి ఎక్కడ అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. ఈ నిబంధన ఏ డిపోలకు అమలు కావడం లేదని చెప్పారు. కాం ట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు, అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ బస్సుల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లకు కనీస పిఎఫ్‌, ఈఎస్‌ఐ వారాంతపు సెలవులు, పబ్లిక్‌ హాలిడేస్‌ వర్తింప చేయడం లేదని, గుర్తింపుకార్డులు కూడా ఇవ్వడం లేదని, విధుల్లో మరణించిన కార్మికుల కుటుం బాలకు నష్టపరిహారం అందించడం లేదన్నారు. సిఐటియు సంఘం ఉన్నచోట కార్మి కులు పోరాడి కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరించుకో గలిగారన్నారు. నిత్య వసర ధరలు ఇంటి అద్దె, విద్య వైద్యం, కరెంటు ఖర్చులు భారీగా పెరిగా యని వారికి వ చ్చే జీతాలు తక్కువని అవి కూడా ప్ర తి నెల 10వ తారీకు లోపు ఇవ్వటం లేదని, కొన్ని డిపోల్లో మూడు,నాలు గు నెలలకు ఒకసారి చెల్లించటం దా రుణ మైన విషయం, కార్మి కుల దగ్గర ఉండాల్సిన బాంకు పుస్తకాలు, ఎటిం కార్డులు కాంట్రాక్టర్ల దగ్గర ఎందుకు ఉటంన్నాయి అని అన్నారు.రెగ్యు లర్‌ కార్మికుల కన్నా ఎక్కువ పని చే యించు కుంటున్నారని కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్మికులకు అమలు కావలసిన హక్కులు చట్టాల విషయంలో ఆర్టీసీ యాజమాన్యం శ్రద్ధ చూపటం లేద న్నారు ఇప్పటికైనా ఇతర డిపార్ట్మెంట్లలో పెరిగిన విధంగా ఆర్టీసీలో కూడా కార్మి కులకు జీతాలు పెరగాలని పిఎఫ్‌ ఈఎస్‌ఐ సెలవులు అమలు కావాలని తదితర డిమాండ్ల సాధనకై ఐక్యంగా కదలాలని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు. అనంత రం పలు సమస్యల పరిష్కరం కోసం డిపో మేనేజర్‌ ఎస్‌. రాంబాబుకు వినతి పత్రాన్ని ఇచ్చారు. దానికి ఆయన సాను కూలంగా స్పందించి డిపో స్థాయిలో పరిష్కరించదగిన సమస్యలను వెంటనే పరిస్కరిస్తానని, మిగిలిన సమస్యలను ఉన్నతాధికారులతో, కాం ట్రాక్టర్లతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పా రన్నారు. కార్యక్రమంలో సిఐటియు గౌరవాధ్యక్షులు పెరుబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️