కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు యుటిఎఫ్‌ చేయూత

Dec 24,2023 23:54 #యుటిఎఫ్‌
యుటిఎఫ్‌

ప్రజాశక్తి-రాజవొమ్మంగి: నాలుగు నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్న మండలంలోని విద్యా వనరుల కేంద్రం, వివిధ పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు యుటిఎఫ్‌ మండల శాఖ చేయూతనిచ్చింది. ఆదివారం స్థానిక ఎంఆర్‌సి కార్యాలయం వద్ద మండలంలో సర్వశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న 13మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్కొక్కరికీ 25కిలోల బియ్యం, రూ15వేలు ఆర్థికసాయాన్ని అందించారు. స్థానిక ఎంపిడిఒ ఎల్‌ యాదగిరీశ్వరరావు, ఎంఇఒ సూరయ్యరెడ్డి చేతుల మీదుగా యుటిఎఫ్‌ తమ వంతు బాధ్యతగా వీటిని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు పైడిమల్లి ప్రధాన కార్యదర్శి రమణ, కోశాధికారి కానెం శ్రీను, గౌరవ అధ్యక్షులు సత్యవతి, అసోసియేట్‌ అధ్యక్షులు సుబ్బారావు, ప్రసన్న, కుటుంబ సంక్షేమ కార్యదర్శి శ్రీను, పత్రిక కార్యదర్శి శ్రీను, రాష్ట్ర కౌన్సిలర్‌ వెంకటలక్ష్మి, జిల్లా కౌన్సిలర్స్‌ బొజ్జియ్య, రమేష్‌, గంగరాజు, సిపిఎస్‌ కన్వీనర్‌ మూర్తి, పలువురు యుటిఎఫ్‌ నేతలు, సిఆర్‌పిలు పాల్గొన్నారు.

 కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆర్థిక సాయం చేస్తున్న యుటిఎఫ్‌ నేతలు

➡️