కాపు సామాజిక భవనానికి శంకుస్థాపన

Mar 16,2024 21:01

ప్రజాశక్తి- బొబ్బిలి : స్థానిక శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్‌ మిల్లు పక్కన కాపు సామాజిక భవనానికి ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుకాపుల సంక్షేమానికి పని చేస్తామన్నారు. సామాజిక భవనం నిర్మాణానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, కౌన్సిలర్లు, కావు సంఘ నాయకులు పాల్గొన్నారు.రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనపట్టణంలోని గొల్లపల్లిలో ఉపాధి నిధులు సుమారు రూ.1.15 కోట్లతో బి.టి రోడ్డు నిర్మాణానికి మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీ కృష్ణ శనివారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గొల్లపల్లి, వంతరాం రోడ్‌ జంక్షన్‌ నుంచి రంగరాయపురం వరకు సుమారు 3 కిలోమీటర్స్‌ వరకు బి.టి రోడ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్‌ మెంబర్‌ తెర్లి సత్యారావు, 10వ వార్డు వైసిపి ఇంఛార్జి తుట్ట తిరుపతి, వైసిపి నాయకులు పైల సురేష్‌, బి.అప్పారావు, ఎన్‌.సింహాచలం, ఆర్‌.రామారావు, డి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.వేపాడ: మండలంలోని కుంపల్లిలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి కొరత రాకుండా ముందుస్తు చర్యలో భాగంగా తాగునీటి బోరుబావి నిర్మాణానికి ఎంపిపి డి. సత్యవంతుడు శనివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అరుణ. ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ దేవి, పంచాయతీ కార్యదర్శి నిసార్‌ కమల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

➡️