కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి

Mar 26,2024 21:36

ప్రజాశక్తి – విజయనగరం కోట: టిడిపి కార్యకర్తలు, నాయకులంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. మంగళవారం అశోక్‌ బంగ్లాలో టిడిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదితి గజపతి రాజు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ముఖ్యంగా ఓటర్ల జాబితాను అందరు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. దొంగ ఓట్లను గుర్తించడం, కొత్త ఓటర్లను చేర్పించడం కోసం ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఈ అంశాలను ప్రతిరోజూ సమన్వయం చేయడానికి కొంతమంది సీనియర్‌ నాయకులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, టిడిపి మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, అవనాపు విజరు, పిల్లా విజరు కుమార్‌, గాడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.టిడిపిలోకి చేరికలుపట్టణంలోని 6,7,45వ డివిజన్లకు చెందిన వైసికి నాయకులు కంది రాంబాబు, కోట్ల అప్పలనాయుడు, ఆల్తి చిట్టిబాబుతో పాటు సుమారు 80 కుటుంబాలు మంగళవారం టిడిపిలో చేరాయి. అశోక్‌ బంగ్లాలో ఎమ్మెల్యే అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతి వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️