కిచ్చాడలో బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ

Feb 6,2024 21:10

ప్రజాశక్తి – కురుపాం : రాష్ట్రం అభివద్ధి చెందాలంటే టిడిపి జనసేన కూటమి తోనే సాధ్యమని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. మండలంలో కిచ్చాడలో మంగళవారం బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయను మాట్లాడుతూ రాష్ట్రం అభివద్ధి చెంది ప్రజల భవిష్యత్తుకు భరోసా కావాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, కావున రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలోటిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేశ్‌ చంద్ర దేవ్‌, నియోజకవర్గ ఇన్చార్జి టి. జగదీశ్వరి, మండల కన్వీనర్‌ కెవి కొండయ్య, నాయకులు చిలకల వెంకటరావు, జనసేన నాయకులు ఎన్‌. వంశీ పాల్గొన్నారు.లక్కాయి గూడలో…ీ సీతంపేట : మండలంలోని శిలగాం పంచాయతీ పరిధి లక్కాయిగూడలో పాలకొండ నియోజకవర్గ టిడిపి నాయకులు పడాల భూదేవి బాబు షూరిటీ-భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలతో అవగాహన చేశారు. అలాగే సమావేశం లో టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సూపర్‌ సిక్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సవర అక్కరాజు, సవర సిమ్మయ్య, సవర గణేష్‌, మహిళలు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️