కుష్టువ్యాధి నిర్మూలన మనందరి బాధ్యత

ప్రజాశక్తి-పీలేరు కుష్టువ్యాధి నిర్దారణ, నిర్మూలనకు ప్రజలు అందరూ సహకరించాలని డాక్టర్‌ రమేష్‌రెడ్డి తెలిపారు. గురువారం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాండ్ల గ్రామంలో స్పర్శ లేని మచ్చలు కుష్టువ్యాధి కావచ్చు అనే అంశంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిం చారు. మైక్రో బ్యాక్టీరియాలెఫ్రె అనే క్రిమి వల్ల వచ్చే కుష్టువ్యాధి ఇతర అంటు వ్యాధుల్లాంటిదని, కుష్టువ్యాధి నిర్ధారణ అయ్యాక, చికిత్స సక్రమంగా తీసుకుంటే ఏ దశలో ఉన్నా పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. బహుళ ఔషధ చికిత్సతో పూర్తిగా నివారణపొంది, సామాజిక జీవనం గడపవచ్చని తెలిపారు.ఈ చికిత్స అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయని చెప్పారు. శరీరంపై పాలిపోయిన, ఎరుపు లేదా రాగి వర్ణంగల, స్పర్శ లేని మచ్చలుంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి సర్వే నిర్వహిస్తున్న సామాజిక ఆశ కార్యకర్తలకు చెప్పి వ్యాధి నిర్దారణలో సహకరించి, కుష్ఠు వ్యాధి రహిత సమాజానికి చేయూత నివ్వండని ప్రజలను కోరారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కొండయ్య, యంపిహెచ్‌ఇఒ శ్రీను, ఏఎన్‌ఎం కరీమున్నిసా, డిఇఒ నాగసుధ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. పుల్లంపేట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన పోస్టర్ణఉ డాక్టర్‌ ముద్దా రామసుబ్బారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 12వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కుష్టు వ్యాధి పై సర్వే జరుగుతుందని తెలిపారు. ఆశా కార్యకర్తలు, వాలంటరీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఎం ఎల్‌హెచ్‌పిలు పాల్గొని ప్రతి కుటుంబం లోని వ్యక్తులు అందరిని పరీక్షించి స్పర్శ లేని మచ్చలను గుర్తించి ప్రతిరోజు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో నివేదికను అందించాలని తెలిపారు. ఆశ కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు ప్రతిరోజూ ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలిపారు. అనంతరం కుష్టు వ్యాధి నివారణ నిర్మూలనపై పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ మనోజ్‌, డాక్టర్‌ సానే శేఖర్‌, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️