కెసిఆర్‌ ఓటమికి అహంకారమే కారణం :ఎమ్మెల్సీ ఇళ్ళ

Dec 14,2023 15:19 #West Godavari District

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : తెలంగాణలో ఉద్యోగులు, ప్రజల పట్ల ప్రదర్శించిన అహంకారం వలనే కెసిఆర్‌ ఓడిపోయారని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు చెప్పారు. పాలకొల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు 3 వ రోజు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగన్వాడీలకు 5 సంవత్సరాల క్రితం జగన్‌ ఇచ్చిన హామి అమలు చేయాలని ఉద్యోగులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. సిఎం స్థాయిలో పోరాటం చేస్తున్న ఉద్యోగులతో కనీసం మాట్లాడక పోవడం అహంకారంకు నిదర్శన అని చెప్పారు.గతంలో 36 గంటలు అంగన్వాడీ లు సమ్మె చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఓటు ఆయుధంతో సమాధానం చెప్పండి అని కోరారు.పోరాటం చేయనిదే ఏ ప్రభుత్వం సమస్య లు పరిష్కారం చేయదని చెప్పారు. టీచర్లకు ప్రభుత్వం రూ 50 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉందని చెప్పారు.ఉద్యోగులు జీతాలు పెంచమని కోరుతుంటే ప్రభుత్వం 15 రోజులకు కూడా జీతాలు ఇవ్వకుండా నాటకాలు చేస్తోందని చెప్పారు.ఇంకా అంగన్వాడీ నేతలు, సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌,వై అజరు,యుటిఎఫ్‌ నేతలు లక్ష్మి నారాయణ,రాంజీ అంబేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️