కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహనే లక్ష్యం

Dec 18,2023 20:50
వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహనే లక్ష్యం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో గవర్నర్‌ప్రజాశక్తి – క్యాంపస్‌ (తిరుపతి జిల్లా) 2047 నాటికి భారత్‌ మహాశక్తివంతమైన దేశంగా నిలవనున్నదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికార యంత్రాంగం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోమవారం శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ భారతి, కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, ఎంఎల్‌సి సిపాయి సుబ్రమణ్యం, మేయర్‌ డాక్టర్‌ శిరీష, కమిషనర్‌ హరిత, గ్రామ పంచాయతీ అధికారి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. గవర్నర్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులందరికీ అందేలా అవగాహన కల్పించడంతో పాటు, కోట్లాది మంది పౌరుల నిర్లక్ష్య భావనను దూరం చేయడం ఈ యాత్ర లక్ష్యమన్నారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను చివరి మైలు ప్రజల వరకు చేరేలా లక్ష్యంగా సాగుతోందన్నారు.వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

➡️