కొండ దొరల జీవన స్థితిగతుల పరిశీలన

కలిదిండి:మండలంలోని కోరుకొల్లుకు వలస వచ్చిన షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ (కొండ దొర)ల సామాజిక స్థితిగతులను జిల్లా పరిషత్‌ సిఇఒ కెఎస్‌ఎస్‌.సుబ్బారావు పరిశీలించారు. కొన్నేళ్ల క్రితం వలస వచ్చిన షెడ్యూల్డ్‌ ట్రైబ్‌లకు ఇళ్ల స్థలాలు, కుల ధృవీకరణ పత్రాలు అందించాలని వారు కోరడంతో సానుకూలంగా స్పందించిన సిఇఒ ఈ విషయమై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని ఎంపిపి చందన ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపిడిఒ దినతేజ్‌, ఇఒపిఆర్‌డి రాజారావు, విఆర్‌ఒ రాజబాబు, పంచాయతీ ఇఒ ఉదరుకుమార్‌, సొసైటీ అధ్యక్షులు అంకెం నరసయ్య పాల్గొన్నారు.

➡️