కొన(వండ)లేం..!

Dec 21,2023 22:10
కూరగాయల వ్యాపారి

కొన(వండ)లేం..!ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో వర్షాభావం.. డిసెంబర్‌లో మిచౌంగ్‌ తుపాను.. వెరశి కూరగాయల ధరలు మూడింతలు పెరిగాయి.. మార్కెట్లో ఏ కూరగాయ పట్టుకున్నా కిలో రూ.60పైనే ధర పలుకుతోంది. దీంతో మహిళలు కూరగాయలు కొనలేం, వండలేం అంటూ నిట్టూరుస్తున్నారు. కిలోలకు కిలోలు కొనే గృహిణులు పావుకేజీ, అరకేజీలతో సరిపెడుతున్నారు. కార్తీకమాసంలో భక్తులకు, అయ్యపస్వాములకు ఈ కూరగాయల ధరలు చుక్కలు చూపించాయంటే అతిశయోక్తి కాదు. కార్తీకమాసంలో ఎక్కువమంది కూరగాయల కంటే చికెన్‌ ఎక్కువ కొన్నారన్నది వాస్తవం. అయితే కార్తీకం అయిపోవడంతో ప్రస్తుతం చికెన్‌ ధరకూ రెక్కలొచ్చాయి. తుపానుకు మునగ, అరటి చెట్లు నేలవాలడంతో వాటి ధరలూ అందుబాటులో లేవు. రానున్న మూడు నాలుగు నెలలు కూరగాయల ధరలు ఈ విధంగానే ఉంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కూరగాయలు కొనలేని కొంతమంది కర్రీపాయింట్లో 20-30కి కూరలు కొని సరిపెట్టుకోవడం గమనార్హం. వెజ్‌కి నాన్‌వెజ్‌కి తేడానే లేదుఒకప్పుడు మాసం తినాలంటే మనస్థాయి కాదులే అనుకునే వాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. చికెన్‌ కన్నా కూరగాయలు రేట్లు పెరిగిపోయాయి. దీంతో కోడికూరే మేలనుకుంటున్నారు. కార్తీకమాసంలో చికెన్‌ కిలో 120 రూపాయలు అయితే చిక్కుడుకాయలు కిలో 120 వరకు పలుకుతున్నది. దీంతో చిక్కుడుకాయల జోలికి వెళ్లడం లేదు. కార్తీక మాసంలో చికెన్‌ ధరలు కొంతమేర తగ్గినా మళ్లీ పెరుగుతున్నాయి. మటన్‌ ఎప్పటిలాగే కిలో 800 రూపాయలకు విక్రయిస్తున్నారు. అధికారుల నియంత్రణ లేకపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలు వస్తున్నాయని జనం ఆరోపిస్తున్నారు.ఇంత రేట్లు ఎప్పుడూ లేవు : పి.శాంతి, టిఫిన్‌ సెంటర్‌ కూరగాయలు తినే పరిస్థితి లేదు. ఇంత రేట్లు గతంలో ఎపుడూ లేవు. టమోటా, మిర్చి కొనుక్కెళ్లి పచ్చడి చేసుకుంటున్నాం. చిక్కుడుకాయ రూ.120 ఉంది. సామాన్యులు తినే పరిస్థితి లేదు.ఈ ధరకు అరకిలో చికెన్‌ కొనుక్కోవచ్చు. టిఫిన్‌ సెంటర్లోనూ టమోటా, మిర్చి పొదుపుగా వాడుతున్నాం. ఏం కొనేటట్లు లేదు : శోభ, తోపుడుబండితోపుడు బండిలో కూరగాయలు అమ్ముకునే మహిళ శోభ మాట్లాడుతూ కూరగాయలు ధరలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. తిరుపతి మార్కెట్‌కు చాలా తక్కువగా కూరగాయలు వస్తున్నాయి. తుఫాను వల్ల పంటలు కొట్టుకొని పోవడం వల్ల ధరలు పెరిగిపోయాయి. నేను తోపుడు బండిలో ప్రతిరోజూ 5వేల రూపాయల సరుకులు తీసుకొచ్చి ఇంటింటా అమ్ముకునేదాన్ని. కూరగాయలు ధరలు పెరగడం వల్ల చాలా తక్కువగా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. కారణం ధరలు పెరగడమే. హోటల్లో, ఫాస్ట్‌ ఫుడ్‌ టిఫిన్‌ సెంటర్లో కూడా పొదుపుగా కూరగాయలు వాడుతున్నారు.కూరగాయ రకాలు ధర (కిలో)బెండకాయ రూ.60దొండకాయ రూ.60గింజ చిక్కుడు రూ.90పచ్చిమిర్చి రూ.50కాకర, బీర రూ.70దోసకాయ రూ.40క్యాప్సికం రూ.80బంగాళదుంప రూ.50క్యాబేజీ రూ.40కంద, చామ రూ.60ఆకుకూర కట్ట రూ.25ఉల్లి కిలో రూ.60కూరగాయల వ్యాపారి

➡️