కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

మండపేటలోని అంగన్‌వాడీల శిబిరంలో మాట్లాడుతున్న ఎన్‌.బలరాం

ప్రజాశక్తి-మండపేట

స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల చేస్తున్న గురువారం సమ్మె కొనసాగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.బలరాం మాట్లాడుతూ అంగన్‌వాడీలతో ప్రభుత్వం తరఫున చర్చలు జరిపేందుకు సజ్జల ఎవరని ప్రశ్నించారు. ఎస్మా చట్టానికి భయపడేది లేదని త్వరలో జిల్లాల వారీగా రిలే నిరాహారదీక్షలు చేపడతామన్నారు. అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అంగన్‌వా కేంద్రాలు తెరిచేది లేదన్నారు. వెంటనే వేతనాలు పెంచుకున్నట్లు మరో జీవో ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో మండపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడిలు పాల్గొన్నారు.

 

 

➡️