కొనసాగుతున్న అంగన్‌వాడీల నిరవధిక సమ్మె

Jan 2,2024 21:54

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : ప్రభుత్వ నిర్లక్ష్యం, అబద్ధపు, తప్పుడు ప్రచారాలకు నిరసనగా పోరాటం ఉధృతం చేసే పోరాటంలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని బుధవారం నిర్వహించే భారీ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి గంటా జ్యోతి పిలుపునిచ్చారు. మంగళవారం పార్వతీపురం ప్రాజెక్టు అధ్వర్యంలో జరుగుతున్న 22వ రోజు నిరసన శిబిరంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రాజెక్టు సెక్టార్‌ లీడర్లు ఆఫీసులకు రావాలని, ఒటిపిలు, ఫోన్‌ నెంబర్లు చెప్పాలని బెదిరింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా బుధవారం స్థానికపాత బస్టాండ్‌ నుండి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ జరుగుతుందని, అనంతరం అక్కడే బైఠాయించ నున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలం లోని అన్ని మండలాల, ప్రాజెక్టుల అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు మాట్లాడుతూ అంగన్వాడి పోరాటం పై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు మానుకోవాలని, ఐక్యంగా మొక్కవోని దీక్షతో పోరాడుతున్న సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే కుట్రలు, కుతంత్రాలు ఆపాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేయాలని తెలిపారు. వీరి ఆందోళనకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, అంగన్వాడీ ప్రాజెక్ట్‌ నాయకులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీ మణి, కె.రాజేశ్వరి, ఎం.గౌరీ, బి.సునీత, విమల, లలిత, రాజేశ్వరి, ధర్మావతి, నీలవేణి, గిరిజ, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు. గరుగుబిల్లి : అంగన్వాడీల సమ్మె 22వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో మండల కేంద్రంలో గంగిరెద్దుకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. తక్షణమే ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఆందోళనలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ మండల నాయకులు ఎం.సా విత్రి, కృష్ణవేణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.సీతానగరం: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు వినూత్న రీతిలో ఎండిగడ్డి, పచ్చ గడ్డి తిని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జి.వెంకటరమణ, ప్రజానాట్య మండలి నాయకులు వై.రామారావు అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు వై.సత్యవతి, కె.శైలజ, సునీత, ఆర్‌.లక్ష్మి, ఎస్‌.అరుణ, పి.పద్మతో పాటు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.కొమరాడ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని సిఐటియు నాయకులు వి.ఇందిర అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ చేస్తున్న సమ్మె 22వ రోజు మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినూత్న రీతిలో దున్నపోతుకు వినతిపత్రం సమర్పించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రాజెక్ట్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు జిహెచ్‌ గౌరమ్మ, సెక్టార్‌ నాయకులు బి.అలివేలు, జ్యోతి, పద్మ, మల్లేశ్వరమ్మ, జయమ్మ, విస్తరాణి, భారతి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.కురుపాం : అంగనవాడీల సమస్యలపై ప్రభుత్వ స్పందించకపోవడంతో వినూత్న రీతిలో అంగన్‌వాడీలు తమ సమస్యల వినతి పత్రం ఎద్దుకు అందజేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగనవాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళకుమారి, ప్రాజెక్ట్‌ కార్యదర్శి జె.సరోజ, కురుపాం, జియ్యమ్మవలస మండలాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.పాచిపెంట : మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు పార్వతీదేవి, బంగారమ్మ, సరోజిని, సుగుణమ్మ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. తమ సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించకపోతే చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.సాలూరు: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేపట్టిన సమ్మె 22రోజుకు చేరింది. అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. యూనియన్‌ నాయకులు బి.రాధ, ఎ.నారాయణమ్మ ఆధ్వర్యాన చేపట్టిన నిరవధిక సమ్మెలో దున్నపోతుకు వినతిని ఇస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్యామల, వరలక్ష్మి, తిరుపతమ్మ, పార్వతి, శశికళ పాల్గొన్నారు.సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట తలపెట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా దున్న పోతుకు వినతి పత్రం ఇస్తూ నిరసన తెలిపారు. వెంటనే అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.పాలకొండ : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పాలకొండ ప్రాజెక్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఒంటి కాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని, ప్రజల మద్దతుతో ఆందోళనలను తీవ్రతం చేస్తామని యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమప్రభ, జిల్లా కోశాధికారి బి.అమరవేణి హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు జి.జెస్సీబాయి, ప్రతినిధులు జి.శారద, ఆర్‌.భవాని, ఎం.శ్యామల, శ్రీదేవి, సుగుణ, లలిత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

➡️