కొనసాగుతున్న అంగన్‌వాడీ వర్కర్స్‌ సమ్మె

Dec 26,2023 20:38
ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌
కొనసాగుతున్న అంగన్‌వాడీ వర్కర్స్‌ సమ్మె
ప్రజాశక్తి ఇందుకూరుపేట : అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గత 14 రోజుల నుంచి సమ్మె చేస్తున్న నేపథ్యంలో మంగళవారం 15వ రోజుకు చేరడంతో అంగన్‌వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్లేట్లతో శబ్ధం చేస్తూ ప్రభుత్వం దిగి రావాలని నినాదాలు చేశారు. ఈ నిరసనకు మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు గొంతు చించుకొని రోడ్లెక్కిన జగన్‌ ప్రభుత్వానికి కొంచెంకూడా చలనం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అంగన్‌వాడీ వర్కర్లపై చిన్నచూపు తగదన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు మారుబోయిన రాజా, సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, సిఐటియు మండల అధ్యక్షులు ఎస్‌కె చాన్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.

➡️