కొనసాగుతున్న పోస్టల్‌ ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి మార్కాపురం రూరల్‌ : తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజూ కొనసాగింది. నిరవధిక సమ్మెతో బ్రాంచి పోస్ట్‌ ఆఫీసులు మూతపడ్డాయి. సమ్మెలో భాగంగ వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్‌ ఉద్యోగులపై సివిల్‌ సర్వెంట్‌ హోదా, సీనియారిటీ ఇంక్రిమెంట్లు, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ,మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పేరుతో వేధింపులు ఆపాలన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఈనెల 15న నిర్వహిస్తున్న ర్యాలీలో పోస్టల్‌ ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆల్‌ ఇండియా గ్రామీణ డాక్‌ సేవక్స్‌ యూనియన్‌ మార్కాపురం డివిజన్‌ కార్యదర్శి నారాయణ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ సహాయ కార్యదర్శి డి.మీరావలి, నారాయణరెడ్డి, బాలంకయ్య, పోస్ట్‌ మాస్టర్లు ,గ్రామీణ డాక్‌ సేవకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి మార్కాపురం రూరల్‌

➡️