కొవ్వొత్తుల నిరసన

Dec 24,2023 21:30

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కొన్ని చోట్ల చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. జగన్‌ మావయ్యా మా టీచర్‌ మాకు కావాలి, మా టీచర్‌, ఆయాకు జీతాలు పెంచండి అంటూ పలకలపై రాసి ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇస్తున్న రూ.11,500 వేతన జిఒలను రాయచోటి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట దహనం చేస్తూ కనీస వేతనం రూ.26 వేలివ్వాలంటూ నిరసన తెలిపారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. రాత్రి స్థానిక జూనియర్‌ కళాశాల ఆవరణం నుండి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు అంగన్వాడీ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రసెడెంట్‌ డి.భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మొదలైన కొవ్వొత్తుల ర్యాలీలో అంగన్వాడీలు బంగ్లా మీదుగా ప్రారంభమై వైయ స్సార్‌ సర్కిల్‌లో మానవహారం నిర్మించి ధరలకు తగ్గ జీతం పెంచాలంటూ గట్టిగా నినాదాలు చేస్తూ నిరసన తెలి పారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాల యం చేరుకుని సమ్మె గురించి మాట్లా డుతూ వేతనాలు పెంచేదాకా, క్రిస్మస్‌ తర్వాత మరింత ఉదతమైన పోరా టాలు చేస్తామన్నారు. కార్యక్రమం సిద్దమ్మ, విజయ, సుమలత, అరుణ, శోభ, నాగమణి పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయా కేంద్రాలలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులు, వారి తల్లులు తమ సంఘీభావం తెలిపి కేంద్రాల వద్ద చిన్నారులతో కలిసి నిరసన తెలియజేశారు. పుల్లంపేట : అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మండల వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల తల్లులు సంఘీభావం తెలిపారు. పిల్లల తల్లులు మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలపై, వారు చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు ప్రజల మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన అంగన్వాడీలకు న్యాయం చేయకపోతే మహిళల ఉసురు తగులుతుందని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం గంగలో కొట్టుకుపోతుందని తెలియజేశారు. 13 రోజుల నుంచి కుటుంబాలను భర్త, పిల్లలను సైతం వదిలి రోడ్లెక్కిన అంగన్వా డీలకు తక్షణమే తగిన న్యాయం చేయాలని పిల్లల తల్లులు డిమాండ్‌ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలసి సిఐటియు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వ హించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్‌.శ్రీలక్ష్మి, మండల అధ్యక్షులు డి.వనజా కుమారి, కె.చెంచులక్ష్మి, ఎస్‌.నాగ లత, పి.రోజా, ఎ.రెడ్డమ్మ, రాధా, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. మదనపల్లి :అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం స్పందించి వారికి న్యాయం చేయాలని పట్టణంలోని విజయనగర్‌ కాలనీలో అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థుల తల్లులు విద్యార్థులు పాల్గొని అంగన్వాడీల సమస్యలు తీర్చాలని అందుకు ముఖ్యమంత్రి దయ చూపాలని కోరారు. విద్యార్థులకు సరైన విద్య, సౌకర్యాలు అందుతాయని అదేవిధంగా గర్భిణులకు బాలింతలకు సరైన పౌష్టికాహారాలు కూడా అందుతాయని అందువల్ల వెంటనే అంగన్వాడీల సమ స్యలు పరిష్కరించి అంగన్వాడి సెంటర్‌ తెరవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కార్యకర్త భాగ్యమ్మ, సిఐటియు నాయకులు హరింద్రనాథ్‌ శర్మ, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాల యం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకొని అంగన్వాడీలు నిరసన తెలిపారు. సిఐ టియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీని వాసులు, నాయకులు మధురవాణి, రాజేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తమ న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నా పట్టింకోని ప్రభుత్వ చర్యలకు నిరసనగా చెవిలో పు వ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో గౌరీ, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు కార్యా లయం అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలో భాగంగా పొర్లుదండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంద ర్భంగా ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సుకుమారి, కార్యదర్శి ఓబులమ్మ, సెక్టార్‌ లీడర్లు రుక్మిణి ప్రభావతి లక్ష్మీదేవి సునీత తదితరులు పాల్గొన్నారు బి.కొత్తకోట : తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, తల్లిదం డ్రులు కొవ్వొ త్తుల ప్రదర్శనతో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

➡️