క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి : డివైఎఫ్‌ఐ

Dec 13,2023 19:28
వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి : డివైఎఫ్‌ఐ
ప్రజాశక్తి -నెల్లూరుడివైఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో 47వ డివిజన్‌ పరిధిలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని, ఉచితంగా క్రీడా కిట్లు ఇవ్వాలని, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని 47వ డివిజన్‌ సచివాలయం అడ్మిన్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న జట్లకు క్రీడా కిట్లు అందజేయ కపోవడం దారుణమన్నారు. ప్రతి డివి జన్‌ పరిధిలో క్రీడాకారులు ఆటలు ఆడేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. నగర నియోజకవర్గ పరిధిలో మినీ , ఇండోర్‌ స్టేడియాలు ఏర్పాటు చేయాలని కోరారు. పారిశుధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. కుళాయిల ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బరాయుడు, బాలు, రాజా తదితరులు పాల్గొన్నారు

➡️