క్షుణ్ణంగా పరిశీలించే పంపుతున్నాం

Mar 1,2024 23:47

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫామ్‌ 6, 7, 8 దరఖాస్తులను పరిష్కరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమావేశానికి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌తోపాటు జెసి ఎ.శ్యాంప్రసాద్‌, డిఆర్‌ఒ వినాయకం పాల్గొన్నారు. దరఖాస్తులు పరిష్కారం, ఎఎంఎఫ్‌, పోలింగ్‌ సిబ్బంది, అధికారుల ఖాళీలు, లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములు, ఫిర్యాదులు, ప్రతికూల వార్తలు తదితర అంశాలపై సిఇఒ సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఫామ్‌ 6,7,8 అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాల కల్పన పూర్తి చేశామని, నోడల్‌ అధికారులను నియమిం చామని తెలిపారు. పెండింగ్‌ ఫారాలను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణిచ్చామన్నారు. ఇదిలా ఉండగా పరిశ్రమల శాఖ ఆధ్వర్యములో ఫార్మైజేషన్‌ అఫ్‌ ఎంఎస్‌ఎంఇ, ఎంఎస్‌ఎంఇ సర్వే సపోర్టు పోస్టరును జిల్లా పరిశ్రమల అధికారి వెంకటేశ్వర్లు, జెసి, డిఆర్‌ఒతో కలిసి కలెక్టర్‌ విడుదల చేశారు.

➡️