ఖాళీ విస్తర్లతో సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన

నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహమ్మద్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) ఉద్యోగులు విధి నిర్వహణలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, అయితే వారు వాటిని పక్కనపెట్టి కేవలం ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలునే కోరుతున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ అన్నారు. అయినా ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని, ఇప్పటికైనా తన మొండివైఖరిని విడనాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని, వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని ఏపి సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (జెఎసి) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె క్రిస్మస్‌ రోజైన సోమవారమూ కొనసాగింది. ఉద్యో గులు ఖాళీ విస్తరాకులతో వినూత్న నిరసన తెలిపారు. సమ్మె శిబిరాన్ని సందర్శించిన ముజఫర్‌ అహమ్మద్‌ మాట్లా డుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తాము ఒంటరిగా అనుకోవద్దని, పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం స్పందించే వరకూ పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 రైతు సంఘాలతో ఢిల్లీలో చేపట్టిన మహాధర్నా మాదిరి ఈ నెల 29న సిఐటియుతో పాటు అన్ని కార్మిక సంఘాలు ఒక వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని, అందులో సమగ్ర శిక్షా ఉద్యోగులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఐక్యంగా పోరాటాలు చేస్తే ముఖ్య మంత్రి మెడలు వంచడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రాథమిక విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఈ విద్య అభివృద్ధి కోసం అంగన్వాడిలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంతగానో కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలే విద్యా రంగం బలోపేతానికి జిడిపిలో 10 శాతం కేటాయిస్తే మనదేశంలో మాత్రం 6 శాతమే కేటాయి స్తున్నారని విమర్శించారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాథమిక విద్యకు బడ్జెట్లో నిధులు పెంచాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నరసరావుపేట మండల అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.రామారావు తదితరులు పాల్గొన్నారు. సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్‌ నకరికల్లు మండల ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఎస్‌టియు రొంపిచర్ల మండల అధ్యక్షులు కె.వీరబ్రహ్మాచారి సందర్శి ంచి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ పేరుతో వెట్టిచాకిరి చేయిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఉద్యోగులు డి.నరసింహస్వామి, పి.నరసింహ నాయక్‌, బి.కోటేశ్వరరావు నాయక్‌, ఎం.శివ నాగ ప్రసాద్‌, ఎం.పోతురాజు, పి.రామకృష్ణ, పి.సాంబశివరావు, డి.శ్రీకాంత్‌, షేక్‌ బాషా, ఎన్‌.మంగయ్య, కె.వెంకట్‌, డి.లింగయ్య పాల్గొన్నారు.

➡️