‘గడప గడపకూ కాంగ్రెస్‌’

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నాయకులు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం అధ్యక్షుడు యనమల సాయి జగన్‌యాదవ్‌ కోరారు. సిఎస్‌పురం మండలం చెర్లోపల్లి పంచాయతీలోని తుమ్మకుంటలో గడపగడపకూ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరిగి ప్రజలకు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️