గరిష్ట పింఛనుకు ఉద్యమాన్ని కొనసాగిద్దాం

ఇపిఎఫ్‌95 పెన్షనర్స్‌

ప్రజాశక్తి- మాధవధార : గరిష్ట పింఛను సాధనకు పెన్షనర్లంతా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఇపిఎఫ్‌95 పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు పర్సన్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.సుధాకరరావు పిలుపునిచ్చారు.ఆదివారం మురళీనగర్‌ వాకర్స్‌ పార్కులో హిందుస్థాన్‌ షిప్‌యార్ద్‌ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు బూసి ప్రసాదరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 70వేల మంది ఇపిఎఫ్‌ 95 పెన్షనర్లు సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా చేస్తున్న న్యాయపోరాట వివరాలను వివరించారు ఈ న్యాయపోరాట ఫలాలు 2014 ఏడాది సెప్టెంబర్‌ నెల తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. భవిష్యత్తులో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను వివరించారు కార్యక్రమంలో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు పి సూర్యనారాయణ, కోశాధికారి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు కరుణాకర్‌, కె సూర్యచంద్రరావు, పివి.గోపాలరావు పాల్గొన్నారు.

వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న సుధాకరరావు

➡️