గాంధీ మార్గం అనుసరణీయం : ఎస్‌పి

ప్రజాశక్తి-రాయచోటి రూరల్‌ జాతిపిత మహాత్మ గాంధీ చూపిన మార్గాన్ని మనమందరం అనుసరించాలని ఎస్‌పి బి.కృష్ణారావు అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రానికి పోరాడిన గొప్ప వ్యక్తి గాంధీజీ అన్నారు. సత్యం, అహింస గాంధీజీ నమ్మే సిద్ధాంతలు అయితే, సహాయ నిరా కరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలన్నారు. నూలు వడికి, మురికివాడలు శుభ్రంచేస్తూ, అన్నికులాలు, మతాలు ఒకటేనని చెప్పిన మహాను భావుడన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా దేశంపై చెరగని ముద్ర వేసిన గాంధీజీ 1948 జనవరి 30న హత్యకు గురయ్యారన్నారు. బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటలుగా నిలిచాయని తెలిపారు. గాంధీ సిద్ధాంతాలు, ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకం. మహాత్ముడి పోరాటం ప్రపంచమంతటికీ ఆదర్శమేనని పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి మహౌన్నత వ్యక్తిగా అవతరించారని తెలిపారు. కార్యక్రమంలో ఎఆర్‌ ఆర్‌ఐ అడ్మిన్‌ పెద్దయ్య, దిశ సిఐ చంద్ర శేఖర్‌, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లి : మహాత్మా గాంధీజీ 76వ వర్ధంతి సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు పులి శ్రీనివాసులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస, సత్యా గ్రహం అనే ఆయుధాలతో భారతదేశానికి బ్రిటిష్‌ వారి నుంచి స్వాతంత్రం తెచ్చా రని కొని యాడారు. ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని అడుగుజాడల్లో మనమం దరం నడవాలని కోరారు. సుభాష్‌ చంద్రబోస్‌, సర్దార్‌ వల్లభారు పటేల్‌, భగత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజు, ఆసిఫుల్లాఖాన్‌ అనేకమంది ప్రాణాలను అర్పించి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చారని సమరయోధుల త్యాగఫలాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడు వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. కార్యక్రమంలో సద్దల జయసింహ, వలసల మంజునాథ్‌, కలిచర్ల నరసింహులు, బొంత రామకష్ణ, కోనే వెంకటరమణ, రాజు పాల్గొన్నారు. రైల్వేకోడూరు : స్వాతంత్య్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని టోల్గేట్‌ సెంటర్‌లోని గాంధీజీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష,కార్యదర్శులు గునిశెట్టి రమేష్‌, చలపాటిహరినాథ్‌ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు మేడా వెంకటసుబ్బయ్య, కామిశెట్టి పార్థసారథి, గునిశెట్టిసాయి, కామిశెట్టి సత్య, నరసింహ, శరత్‌ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా యల్లటూరు భవన్‌లో శ్రీనివాసరాజు గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. వలస వాదుల చెర నుంచి అఖండ భారతావనికి విముక్తి కలిగించి ప్రపంచానికి నూతన పోరాట కొరవడిని నేర్పిన దీశాలి జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్‌ సమ్మెట శివప్రసాద్‌, పత్తి నారాయణ, నారదాసు రామచంద్ర, తోట సురేష్‌, శంకర్‌ రాజు, మౌల, చక్రి పాల్గొన్నారు. సుండుపల్లి : స్థానిక నాలుగు రోడ్ల కూడలి సర్కిల్‌ లో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్‌ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామాశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఎం దామోదర్‌నాయుడు, గ్రామ అధ్యక్షుడు చెన్నం శెట్టి వెంకటరమణ, సుబ్బ రామ, మాజీ ఎంపిటిసి నంద్యాల రామయ్య, సీనియర్‌ నాయకులు ఆనంద్‌ రెడ్డి, బలిజ సంఘం నాయకులు గుగ్గిల కష్ణయ్య, దళిత నాయకులు, వీర నాగయ్య, ఈశ్వర్‌, మహదేవ పాల్గొన్నారు.

➡️