గిద్దలూరులో ఇన్‌ఛార్జుల సమావేశం

ప్రజాశక్తి-గిద్దలూరు: రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీదే విజయమని ఆ పార్టీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని నంద్యాల రోడ్డులోని చీతిరాల కళ్యాణ మండపంలో అశోక్‌రెడ్డి అధ్యక్షతన గిద్దలూరు పట్టణం, గిద్దలూరు మండలంలోని 7,8,9, క్లస్టర్స్‌ పరిధిలోని యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జులు, కుటుంబ సాధికార సారథులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు అభివృద్ధికి, అవినీతికి జరిగే యుద్ధమని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే తెలుగుదేశం జనసేన పార్టీలతోనే సాధ్యమని, క్షేత్ర స్థాయిలో టీడీపీ కార్యకర్తలు కష్ఠపడి ఓటర్లను తెలుగుదేశం వైపు మరల్చి ప్రతి బూత్‌లో టీడీపీకి మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు, టీడీపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ, మండల క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జులు, కుటుంబ సాధికార సారథులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

➡️