గీతంలో ఐసిసి వార్షిక సమావేశాలు

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం

ప్రజాశక్తి- మధురవాడ : కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలలో ఏటా నిర్వహించే ఇండియన్‌ కంట్రోల్‌ కాన్ఫ్‌డెన్స్‌ (ఐసిసి) 9వ వార్షిక సమావేశాలను సోమవారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. గీతం వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవట్టం పాల్గొని, గీతం వర్సిటీ పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ ప్రొఫెసర్‌ సిహెచ్‌. విజయశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశాలలో సైన్స్‌, ఇంజనీరింగ్‌ రీసెర్చి బోర్డు నిపుణుడు, ఐఐటి హైదరాబాద్‌ విశిష్ఠ ప్రొఫెసర్‌ ఎమ్‌.విద్యాసాగర్‌ ప్రసంగించారు. మూడు రోజుల పాటు జరిగే సమావేశాలలో దేశ, విదేశాలకు చెందిన 150 మంది సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. యంత్రాలను పనిచేయించడంలో కంట్రోల్‌ ఇంజనీరింగ్‌, అప్లైడ్‌ మేధమెటిక్స్‌ అంశాలను చర్చించడంతో పాటు డ్రోన్‌ హర్డ్‌వేర్‌ పరిజ్ఞానం, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి అంశాలపై ప్రముఖల ప్రసంగాలను ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత హర్వర్డ్‌ విశ్వవిద్యాలయం, పర్ధు విశ్వవిద్యాలయాలతో పాటు దేశంలోని ఐఐటిలు నుంచి పరిశోధకులు హజరయ్యారు. టిసిఎస్‌ రీసెర్చి, ఎడ్యూటెక్‌, క్వాలిసిస్‌,, మేధ్‌వర్క్స్‌ వంటి ప్రముఖ పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు.

సమావేశాలను ప్రారంభిస్తున్న గీతం విసి

➡️