గుంజీలు తీస్తూ వినూత్న నిరసన

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ వేతనాలు పెంచకుండా ‘మేము పెంచినప్పుడు మాత్రమే మీరు తీసుకోవాలి’ ప్రభుత్వ విధానం సరైంది కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.ఎ.రామాంజులు పేర్కొన్నారు. శనివారం అంగన్వాడీల సమ్మె 33వ రోజుకు చేరింది. కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో టెంట్‌లో అంగ న్వాడీలు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి అంగన్వాడీలు కేవలం లక్షమంది ఉన్నారని, వారు 5 కోట్ల మందిలో కేవలం లక్షమంది ఉన్నారని, ఓటు వేస్తే ఎంత వేయకపోతే ఎంత అని పేర్కొడనం తగదన్నారు. మహిళలను గౌరవం కూడా లేకుండా తూలనాడడం ప్రభుత్వం పతనానికి నాంది అని తెలిపారు. ఆరుసార్లు చర్చలకు పిలిచి ఎస్మా ప్రయోగించి చివరికి తమ అనుచరులు, సూపర్‌వైజర్ల ద్వారా బెదిరిస్తే సమ్మె విరమించరని అంగన్వాడీలు సమ్మె మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు సంతకాల సేకరణ పేరుతో కోటి మందితో సంతకాలు సేకరించి జగన్‌ ప్రభుత్వానికి బుధ్ధి చెప్పేందుకు ప్రజా నీకంతో పాటు అన్ని వర్గాల సహకారం కోరతామన్నారు. కార్యక్రమంలో అంగ న్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిద్దమ్మ, భాగ్యలక్ష్మి, బంగారుపాప, ఖాజాబి, విజయమ్మ, అరుణ, సరస్వతి, సమలత పాల్గొన్నారు. మదనపల్లి: స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసినందుకు నిరసనగా గుంజీలు తీస్తూ 33వ రోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు హరింద్రనాథ్‌ శర్మ, నాయకులు మధురవాణి, రాజేశ్వరి మాట్లాడుతూ 33 రోజులుగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు గౌరీ, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బి.కొత్తకోట : తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ఈ సమ్మెలో 33వ రోజు అంగన్వాడీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో తాము విధులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం అన్నిరకాల ధరలు అమాంతం పెరిగిపో యాయన్నారు. ప్రభుత్వం గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం అమలు చేయాలని, గ్రాట్యూటి అమలు చేయాలని, ఇతర న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లక్కిరెడ్డిపల్లి : జగన్‌ మామయ్య మా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని అంగన్వాడీ సెంటర్‌ పిల్లలు స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లలు సమ్మెలో పాల్గొని చేతులెత్తి నమస్కరించి జగన్‌ మామయ్య మేము మా ఇళ్లల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొం టున్నాం మా అంగన్వాడీల వేతనాలు పెంచి సమస్యలు పరిష్క రించాలని కోరుకుంటున్నామని వారు నినదించారు. 33 రోజులుగా మమ్మల్ని ఇంటి వద్ద వదిలేసి ప్రతిరోజూ అమ్మలు ధర్నాలో కూర్చుంటున్నారు, దయచేసి వీరికి కనీస వేతనంతో పాటు వారి డిమాండ్లు పరిష్కరించాలని జగన్మామైన కోరుకుంటు న్నామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షలు సుకుమారి, కార్యదర్శి ప్రభావ తమ్మ, యూనియన్‌ సెక్టార్‌ లక్ష్మీదేవి, ఇరగమ్మ, నాగమణి, నాగవేణి, శ్రీవాణి, శిరీష, మూడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️