గుమ్మగదవలస వంతెన వద్ద తప్పిన పెనుప్రమాదం

Feb 6,2024 21:23

 ప్రజాశక్తి – కురుపాం : మండలంలోని గుమ్మగదబవలస సమీపంలో గల వంతెన వద్ద మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. స్థానికుల అందించిన వివరాల ప్రకారం పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాలకు పరీక్షా పేపర్లు తీసుకువెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి వంతెన ముందు గోడను ఢకొీట్టి వంతెనకు వైపు వ్యాను ఎక్కి ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వంతెన ఇరుగ్గా, ఇరువైపులా రక్షణ గోడల్లేకపోవడంతో ఇలా జరిగింది. వాహనాల రాకపోకలకు వీల్లేక వ్యాను తీసే వరకూ ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో సుమారు మూడు గంటలు ట్రాఫిక్‌ జామైందని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గుర య్యారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ద్విచక్ర వాహనాలతో, ఆటోలతో వెళ్లేవారు చాలా సందర్భాల్లో ఇక్కడ ప్రమాదాలు జరిగి ఈ వంతెనలో పడి ప్రాణాలు విడిచిన సంఘటన ఎన్నో ఉన్నాయని, కావున ఇప్పటికైనా సంబం ధిత అధికారులు స్పందించి వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వాహన చోదకులు, సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

➡️