గెలిపించండి.. అభివృద్ధి చేస్తా: డాక్టర్‌ ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి: నీరు లేక, నివాసం లేక అల్లాడుతున్నామని, తమ సమస్యలు పట్టించుకునేవారే కరువయ్యారని శివనగర్‌ కాలనీ ప్రజలు టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి వద్ద ఆవేదన వెలిబుచ్చారు. కనిగిరి మున్సిపాలిటీ శివనగర్‌ కాలనీలో మన ఊరు -మన ఉగ్ర, బాబు ష్యూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా సురక్షిత జలాలు అందిస్తానని, ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు పక్కా గృహాలను మంజూరు చేయిస్తానని డాక్టర్‌ ఉగ్ర తెలిపారు. వెనుకబడిన కనిగిరి ప్రాంత అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వివిఆర్‌ మనోహర్రావు, చింతలపూడి తిరుపాలు, పచ్చవ చంద్రశేఖర్‌, పాలూరి సత్యం, ఈదర రవికుమార్‌, కనిగిరి మనోహర్రావు, ఉదయగిరి బాలచెన్నయ్య, చిలకపాటి లక్ష్మయ్య, నజీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️