గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు

Mar 28,2024 21:08

ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో వైసిపిని మళ్లీ గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి చెప్పారు. గురువారం ఆమెతో పాటు వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ కళ్లేపల్లి త్రినాధ్‌నాయుడు మండలంలోని బోరబంద సచివాలయం పరిధిలో ఉన్న తెంటుబొడ్డవలస, దేవుబుచ్చింపేటలో ఇంటింటికి తిరిగి డిప్యూటీ సిఎం రాజన్నదొర నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. వైసిపి అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశం ఉందని చెప్పారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. రాజన్నదొరను మరోసారి ఆదరించాలని కోరారు. మరిపిల్లిలో మండల వైసిపి అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యాన సీనియర్‌ నాయకులు సువ్వాడ రామకృష్ణ, పెద్దింటి మాధవరావు, కె.పోలినాయుడు, ఎంపిటిసి సభ్యులు జన్ని సీతారాం ఇంటింటికీ తిరిగి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు.పార్వతీపురంరూరల్‌ : మండలంతో పాటు పట్టణంలో వైసిపి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే అలజంగి జోగారావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని వెంకంపేట మున్సిపాలిటీ పరిధిలోని 23, 24 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఐదేళ్లుగా తాను చేసిన సేవలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచి తీళ్ల కృష్ణారావు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు. సీతంపేట: మండలంలోని పూతికవలస, మర్రిపాడు, చిన్నబగ్గ, కీసరజోడు పులిపుట్టి పంచాయతీల్లో స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేదల కోసంఅనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన తమ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, జడ్పీటీసీ ప్రతినిధి సవర రాము, వైస్‌ ఎంపిపిలు, జేసీయస్‌ కో – ఆర్డినేటర్‌ గేదెల కోటేశ్వరరావు (ఎంపిటిసి), చిన్నబగ్గ ఎంపిటిసి ఊయిక మంగయ్య, పూతికవలస సర్పంచ్‌ ప్రతినిధి సవర సుభాష్‌, తదితరులు పాల్గొన్నారు.మర్రిపాడు మాజీ సర్పంచ్‌ సవర సింహాద్రి, కీసరిజోడు సర్పంచ్‌ సున్నాపురం రవి, పులిపుట్టి వైఎస్‌ఆర్సిపి కార్యకర్త సవర వెంకటేష్‌, మండల ఎంపీటీసీలు – సర్పంచ్లు, గ్రామ సచివాలయం కన్వినర్‌ లు, వైఎస్సార్సీపీ నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

➡️