గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

ప్రజాశక్తి-శింగరాయకొండ: కొండపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ (సత్య) పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుమల్లి మండలంలో ఆయన పర్యటిం చారు. నందనవనం, బిట్రగుంట, చిలుకూరు పాడు చింతలపాలెం కామేపల్లి వరకు ఆయన గ్రామగ్రామాన పర్యటించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గ్రామాల్లో సమావేశమై ఎన్నికల నోటిఫికేషన్‌ రానుందని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తా గ్రామాల్లో కొండేపి శాసనసభ్యులుగా డాక్టర్‌ డోలా బాల వీరాంజనేయ స్వామి గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం జనసేన పొత్తుతో తెలుగుదేశం పార్టీని విజయం ఢంకా మోగించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా హాజరయ్యారు.

➡️