గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్‌పి

Mar 3,2024 21:14

ప్రజాశక్తి- తెర్లాం : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు అన్నారు. ప్రతి కుటుంబాన్ని బూత్‌ కమిటీ సభ్యులు సంప్రదించి వైసిపి ప్రభుత్వంలో ఆ కుటుంబానికి అందిన లబ్ధిని వివరించాలని సూచించారు. ఆదివారం మండల పరిధిలో గల బూత్‌ కన్వీనర్లతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండరా దనే లక్ష్యంతో బూత్‌ కమిటీలను పక్కాగా నియమిం చామని ప్రతి ఇంటితోనూ పార్టీ క్యాడర్‌ మమేకం అవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రతి బూత్‌ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు కలిసి ‘మేము సిద్ధం మా బూత్‌ సిద్ధం’ అనే కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపిపి నర్సుపల్లి ఉమాలక్ష్మి, జిల్లా జేసిఎస్‌ కన్వీనర్‌ శంబంగి శ్రీకాంత్‌, నాయకులు గర్బాపు రామారావు, వైస్‌ ఎంపిపి చెపేన సత్యనారాయణ, వైసిపి మండల అధ్యక్షుడు తెంటు సత్యం నాయుడు, యువజన అధ్యక్షుడు మదాసు శేషగిరి, నాయకులు బోను అప్పలనాయుడు, మర్రాపు జగన్నాధం, సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

➡️